Watch: స్కూటీ నడుపుతుండగా గుండెపోటు.. నడిరోడ్డుపై కుప్పకూలి ఉద్యోగి మృతి
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్‌లోని దావా బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ధర్మేంద్ర కుమాయు (32) అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఈ హార్ట్‌ఎటాక్ అందరినీ వెంటాడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ఒక ఉద్యోగి హాఠాత్తుగా గుండెపోటుకు గురై రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తి కుప్పకూలి మరణించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్‌లోని దావా బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ధర్మేంద్ర కుమాయు (32) అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.