Hyderabad: 40 నిమిషాల జర్నీ, ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే.. అబ్బుర పరుస్తోన్న స్టీల్ బ్రిడ్జ్‌ డ్రోన్‌ విజువల్స్‌

Updated on: Aug 19, 2023 | 5:53 PM

తాజాగా నగరంలో కొత్త ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జినీ శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఒకప్పుడు లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వీఎస్‌టీ వెళ్లడానికి ఏకంగా..

హైదరాబాద్‌, ఆగస్టు 19: హైదరాబాద్‌ అంటేనే ట్రాఫిక్‌ పద్మవ్యూహం. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పద్మవ్యూహలను ఒక్కొక్కటిగా ఫ్లైఓవర్ల రూపంలో చేధిస్తోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎన్నో బ్రిడ్జ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా నగరంలో కొత్త ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జినీ శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఫోర్ లైన్ స్టీల్‌ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఒకప్పుడు లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వీఎస్‌టీ వెళ్లడానికి ఏకంగా 40 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడీ బ్రిడ్జ్‌ అందుబాటులోకి రావడంతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. ముఖ్యంగా వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పడనుంది. ఇక రూ. 450 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నగరానికి మరో ఐకానిక్‌గా మారింది. తాజాగా ఈ ఫ్లైవర్‌కి సంబంధించిన డ్రోన్‌ విజువల్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Aug 19, 2023 05:52 PM