భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..
ఇరాన్ ముప్పు వంటి పరిస్థితుల్లో చమురు కొరతను అధిగమించేందుకు భారత్ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను (SPR) ఏర్పాటు చేసింది. 80% దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు ఇంధన భద్రత అత్యవసరం. విశాఖపట్నం, మంగళూరు, పాడూర్‌లలో భూగర్భ గుహల్లో చమురు నిల్వలున్నాయి. ఇవి దేశాన్ని 15 రోజుల పాటు, కంపెనీ నిల్వలతో కలిపి 2.5 నెలల పాటు చమురు కొరత లేకుండా చూస్తాయి, యుద్ధాలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షిస్తాయి.
ఇజ్రాయెల్‌తో యుద్ధం, అమెరికా దాడులతో హర్మూజ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరించిన ఇరాన్ అన్నట్లే చేసింది. ఏడాది క్రితమే ఇరాన్ హెచ్చరికతో భారత్ అలర్టయింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా అయ్యే ఈ జలసంధిని మూసేస్తే… చమురు కొరత తలెత్తి, ధరలు భారీగా పెరుగుతాయని భావించి మన పాలకులు ముందు చూపుతో చమురు నిల్వ చేసారు. 80 శాతానికిపైగా చమురు దిగుమతులపైనే భారత్ ఆధారపడింది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే కొంతకాలం తట్టుకునేందుకు వీలుగా భారత్ భారీగా చమురు నిల్వలను ఏర్పాటు చేసింది. భూమి అడుగున భారీ గుహలను తొలిచి, అందులో చమురును నిల్వ చేస్తోంది. 1990ల్లో గల్ఫ్ యుద్ధం నాటి పరిణామాలతో 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం ‘వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల strategic petroleum reserve ఎస్‌పీఆర్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. విశాఖపట్నంతో పాటు కర్ణాటకలోని మంగళూరు, పాడూర్‌లో భారీ భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. వీటిలో 53 లక్షల టన్నుల చమురును నిల్వ చేసారు. కర్ణాటకలోని పాడూర్‌లో 25 లక్షల టన్నుల సామర్థ్యం, ఒడిశాలోని చండీఖోల్‌లో మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర పరిణామాలతో ఒక్కసారిగా చమురు కొరత ఏర్పడితే ఈ వ్యూహాత్మక నిల్వలతో కొంతకాలం ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులు సులువుగా లీకై, ఆవిరవుతుంటాయి. భూగర్భ కేంద్రాలతో ఈ సమస్య తక్కువ. భూమిలో 90 మీటర్ల దిగువన ఈ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించారు. ఒక్కోటీ సుమారు కిలోమీటర్ వెడల్పు, పది అంతస్తుల ఎత్తుతో ఉంటాయి. ఇందులో విశాఖపట్నంలో ఎల్‌పీజీ నిల్వ కేంద్రం ఉంది. ఇది సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 196 మీటర్ల లోతు వరకు ఉండి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ఇంధన నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతమున్న మూడు భూగర్భ నిల్వ కేంద్రాల్లో కలిపి 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురును నిల్వ చేస్తున్నారు. భారతదేశ రోజువారీ చమురు వినియోగం 50 లక్షల బ్యారెళ్లు. విదేశాల నుంచి ఒక్క బ్యారెల్ చమురు రాకపోయినా కూడా 15 రోజుల వరకు సరిపోతాయి. దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల వద్ద ఉండే నిల్వలను లెక్కలోకి తీసుకుంటే సుమారు రెండున్నర నెలల పాటు సరిపోతాయని అంచనా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా
టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్ వన్ చైర్.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా
టాలీవుడ్‌లో నెంబర్ గేమ్.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??
Prabhas: ప్రభాస్ 2.0.. నయా స్టైల్ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే
వెండితెరకు కూడా తప్పని గ్యాస్ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత
