భారత్‌కు భూకంపాల ముప్పు వీడియో
భూగర్భంలో భారత టెక్టోనిక్ ప్లేట్లు చీలిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రక్రియను డిలామినేషన్ అంటారు. దీనివల్ల టిబెట్ కింద భారత ప్లేట్ లోపలికి జారుతోంది. భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాల్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. హిమాలయాలు ఇంకా ఎత్తుకు ఎదుగుతుండటం గమనార్హం.
భూమి పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ, దాని భూగర్భంలో నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి. సాధారణంగా భూమి కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి. సముద్ర గర్భంలో ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు సునామీలు ఏర్పడతాయి. తాజాగా, భారత టెక్టోనిక్ ప్లేట్లు చీలిపోతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని డిలామినేషన్ ప్రక్రియగా పేర్కొంటున్నారు. టిబెట్ పీఠభూమి కింద భారత ప్లేటు లోతుగా చీలిపోయి రెండు పొరలుగా విడిపోతోందని గుర్తించారు. భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ కారణంగానే హిమాలయాలు ఏర్పడ్డాయని, టిబెట్ పీఠభూమి నిర్మాణం జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

