Loading video

“గోలీ సోడా” ఇప్పుడు “గ్లోబల్‌ సోడా”.. ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టి

|

Apr 02, 2025 | 4:23 PM

ఓ యాభై ఏళ్ల క్రితం మన దేశంలో ఇష్టంగా తాగే సాఫ్ట్‌ డ్రింక్‌ గోలీసోడా చూస్తుండగానే పెద్ద కంపెనీల రాకతో కనుమరుగైంది. దీని మూత తీసేటప్పుడు టప్‌ మనే శబ్దం వచ్చేది దానిని అంతా ఆనందించేవారు. అప్పట్లో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న సీసాల్లో వచ్చిన సోడా.. ప్రజల మన్ననలు అందుకున్న పానీయం.

ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చడమే కాకుండా.. కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెచ్చుకుని తాగేవారు. అంతలా జనంలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా విదేశీయులు ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వచ్చేసింది. పైగా విదేశాల్లో దీని డిమాండ్‌ వెరే లెవెల్‌లో ఉంది. “గోలీ సోడా”ను గ్లోబల్‌గా తాగేస్తున్నారు కదా.. అసలు దీని కథేంటో చూద్దామా..! స్ట్రీట్ ఫుడ్‌కి ఇండియా ఫేమస్. స్టార్ హోటళ్లలో దొరకని రుచి తోపుడు బండ్లు, రోడ్డు పక్కన షాపుల్లో దొరుకుతుందనడంలో సందేహం లేదు. ఏ రాష్ట్రానికి వెళ్లినా రోడ్‌సైడ్ బండిపై మ‌న‌కిష్టమైన ఆహారపానీయాలు నోరూరిస్తాయి. అయితే వాటిని రుచిగా చేయడం ఒకెత్తైతే.. విక్రయించడం మరో ఎత్తు. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా చేస్తూ వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తూ కొంద‌రు వ్యాపారులు తమదైన స్టయిల్ కనబరుస్తుంటారు. ఈ స్టయిల్‌ బహుశా గోలీసోడా విక్రయాలు మొదలైన నాటి నుంచి ఇప్పటి దాకా.. కొనసాగుతోందనే చెప్పొచ్చు. దీని ట్రెండ్‌ అలాంటిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో బీభత్సం సృష్టించిన మహిళ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ

పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ

పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు

విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో