Hyderabad: ఆటోలో ఖవ్వాలి వింటూ పెద్దాయన హుషారు.. ఇది కదా జీవితానికి కావాల్సింది!
హైదరాబాద్ నగరంలోని రోడ్లపై ఓ ఆటో వేగంగా వెళ్తుంది. ఆ ఆటోని ఓ పెద్దాయన తోలుతున్నాడు. ఎంచక్కా ఖవ్వాలి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మరీ వెళ్తున్నాడు. హైదరాబాద్ రోడ్లపై ఆ ఆటోలో పెద్దాయన సరదాగా వెళ్తున్న..
మనిషి ఎంత సంపాదించాడనేది ముఖ్యం కాదు.. ఉన్నదాంట్లో ఎంత సంతృప్తిగా జీవించాడనేది ముఖ్యం. జీవితంలో కష్టాలు, నష్టాలు ఎన్నో వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగడమే ప్రధానం. అలా అన్ని కష్టాలను ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయం చేసుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు ఈ ప్రపంచంలో. చిన్న కష్టానికే విలవిలలాడిపోయి ఏంటీ బతుకు అని ఆత్మహత్యల వరకు వెళ్లే వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడ ఓ వ్యక్తి. ఆ వివరాలేంటో చూద్దాం.
హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై ఓ ఆటో వేగంగా వెళ్తుంది. ఆ ఆటోని ఓ పెద్దాయన తోలుతున్నాడు. ఎంచక్కా ఖవ్వాలి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మరీ వెళ్తున్నాడు. హైదరాబాద్ రోడ్లపై ఆ ఆటోలో పెద్దాయన సరదాగా వెళ్తున్న ఆ దృశ్యం చూసేవాళ్లకు ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది. పైగా ఆటో తోలుతున్న ఆ పెద్దాయనకి ఒక కాలు కూడా లేనట్టు తెలుస్తోంది. అయినా అతను ఏ కష్టాన్ని కూడా పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. అతన్ని చూస్తే ఎవరికైనా ఇది కదా జీవితానికి కావాల్సింది అని అనుకోకుండా ఉండరు. పక్కవాళ్లకు ఇబ్బంది పెట్టకుండా కష్టం చేశామా.. సంపాదించుకున్నామా.. ఆనందంగా ఉన్నామా అని ఆలోచించేవాళ్లు అరుదుగా ఉంటారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఇలాగే ఎప్పుడూ ఆ పెద్దాయన సంతోషంగా ఉండాలని, పది మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.