ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా.. బీజేపీ గెలిచిన స్థానాలు ఇవే..
దేశవ్యాప్తంగా జరిగిన 13 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించింది. రెండు స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. బీజేపీ పతనం ప్రారంభమయ్యిందని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాల తోనే సరిపెట్టుకుంది. బిహారి లోని రూపౌలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి శంకర్‌సింగ్ గెలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ సత్తా చాటింది. మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ రెండు గెలిచింది. బీజేపీ అభ్యర్ధి హమీర్‌పూర్‌లో గెలిచారు. దెహ్రా అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో హిమాచల్ CM సుఖ్విందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్ అసెంబ్లీ సీటులో ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యంలో గెలిచారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపుతో సుఖ్విందర్‌సింగ్ ప్రభుత్వం గండం గట్టెక్కింది.
తాజా గెలుపుతో హిమాచల్‌లో కాంగ్రెస్ బలం 40కి చేరుకుంది.