చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్
వర్షాకాలం ముగిసి చలికాలంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది అనుకున్నదానికంటే దాదాపు 30 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో చలికాలం కూడా అదేవిదంగా పంజా విసరబోతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చలిపులి తీవ్రంగా ఉండబోతుందట.
వాయవ్య సరిహద్దు నుంచి వీచే చలిగాలులతో ఈ ఏడాది చలికాలంలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్టు వాతావరణ శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్, డిసెంబర్ మధ్య 71శాతం వరకు చలితీవ్రత ఎకువగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శీతల పరిస్థితులకు కారణమయ్యే లా నినా తిరిగి రావడంతో ఈ సీజన్ మరింత తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2025 చివరినాటికి లా నినా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువగా చలిగాలులు సంభవించవచ్చని వెల్లడించారు. గత ఆరేళ్లలో ఇలాంటి మార్పు ఇదే తొలిసారని కూడా ఐఎండీ ప్రకటించింది. లా నినా అనేది ఒక రకమైన వాతావరణ మార్పుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిని ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ అని పిలుస్తారు. దీనిలో సెంట్రల్ & ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు మారుతాయి, దానితో పాటు వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. ఈ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వస్తాయి. ఈ మార్పులు మూడు రకాలుగా ఉంటాయి. వెచ్చగా ఉండే దానిని ఎల్ నినో అని, చల్లగా మారితే లా నినో అని.. సాధారణంగా ఉంటే.. న్యూట్రల్ అని అంటారు. ఈ మార్పులు రెండు నుండి ఏడేళ్లలో మళ్లీ మళ్లీ మారుతూ ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్
తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని
మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే
