AP Rains: 22న అల్పపీడనం.. 24న వాయుగుండం.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!

Updated on: May 19, 2024 | 8:51 AM

ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి.. దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే వస్తున్నాయని చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి.. దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే వస్తున్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే.. జూన్‌1న రుతుపవనాలు కేరళకు రానున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత.. కేరళ నుంచి ముందుకు కదలి దేశవ్యాప్తంగా జులై 15 కల్లా వ్యాపిస్తాయని తెలిపింది. గత ఏడాది ఎల్​నినో ప్రభావానికి తోడు బిఫర్​జాయ్​ తుఫాన్‌ కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో.. సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ.. ఈ సారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండడంతో జూన్ 1కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Published on: May 19, 2024 08:45 AM