Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం

Updated on: Jan 23, 2025 | 3:17 PM

హైదరాబాదులో సరూర్‌నగర్ డివిజన్‌లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. డాక్టర్స్‌ కాలనీలో వున్న ఈ హాస్పిటల్‌లో తనిఖీలు చేస్తే ఇల్లీగల్‌ గా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ దందా బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్స్‌ చేస్తున్నట్టు తనిఖీల్లో తేలింది.

అలకానంద హాస్పిటల్‌లో కిడ్నీ ఇచ్చిన..కిడ్నీ మార్చుకున్న ఆ నలుగురు పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్‌ చేశారు అధికారులు. అలకానంద హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సహా డాక్టర్లపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు రంగారెడ్డి జిల్లా DM అండ్‌ HO డాక్టర్‌ వెంకటేశ్వరరావు . పోలీసుల దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లు.. డోనర్స్‌, ప్రదీప్‌ అనే మీడియేటర్‌ అలకానంద హాస్పిటల్‌కు వచ్చినట్టు తేలింది. ఒక్కో ఆపరేషన్‌కు 55 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని డాక్టర్‌ పవన్‌ ఆధ్వర్యంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసినట్టు గుర్తించారు పోలీసులు. నిబంధనలు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు వైద్యాధికారులు. అలకానంద హాస్పిటల్‌ను సీజ్‌ చేసేశారు. పేషెంట్లను గాంధీకి షిఫ్ట్‌ చేశారు. ఎన్నాళ్లుగా ఈ దందా జరుగుతోంది? ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇలా కిడ్నీ రాకెట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో రేషన్‌ కార్డు దారులకు అలర్ట్..

Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్‌ ఛైర్‌లో ఇలా..

పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్‌

Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో సోదాలు

డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష