Telangana: ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే..!
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి మౌనిక, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్ కేవలం రెండు వేల రూపాయలతో వివాహం చేసుకున్నారు. కోర్టు వివాహం చేసుకున్న ఈ జంట, సింపుల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వారి నిరాడంబర వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2022 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు, తెలంగాణకు చెందిన మౌనిక, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువరాజ్ మర్మత్.., తమ వివాహాన్ని అత్యంత నిరాబండరంగా నిర్వహించారు. ముసోరిలో ట్రైనింగ్ సమయంలో పరిచయమైన ఈ జంట, 2023లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కోర్టు వివాహం చేసుకున్నారు. వారి వివాహ వేడుక ఖర్చు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే. సింపుల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి, పూల దండలు మార్చుకుని, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ జంట తమ నిర్ణయంతో ప్రస్తుత కాలంలో వివాహ వేడుకలకు అవుతున్న అధిక ఖర్చులకు భిన్నంగా, నిరాడంబరతకు ప్రాధాన్యతనిచ్చింది. వారి ఆదర్శవంతమైన వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published on: Sep 03, 2025 04:38 PM
Follow Us
వైరల్ వీడియోలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!

