ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

Updated on: Sep 07, 2026 | 9:02 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 72 వసంతాలు పూర్తి చేసుకుంది. 69 అడుగుల ఎత్తున పంచముఖ సంకటహర మహా గణపతిగా కొలువుదీరనున్న ఈ విగ్రహం పర్యావరణ హితమైన పదార్థాలతో రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 14 నుండి 25 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహా గణపతి ప్రతీక. ఈ ఏడాది 72 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఖైరతాబాద్ గణపతి, ఈసారి పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 69 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ భారీ విగ్రహానికి పక్కనే సోమనాథ జ్యోతిర్లింగం, కాళీమాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒడిశాకు చెందిన ప్రముఖ మట్టి విగ్రహ కళాకారుడు జాగారావు నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన 150 మంది కళాకారులు 82 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాజస్థాన్ లోని బనాస్ నది మట్టి, హైదరాబాద్ ఇసుకతో పాటు, పూర్తిగా నీటిలో కరిగిపోయే సహజ సిద్ధమైన పదార్థాలు, సేంద్రీయ రంగులను ఉపయోగించి ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. పంచభూతాల వల్ల మానవ జాతికి ముప్పు సంక్రమించే అవకాశాలున్నందున, సర్వమానవాళి క్షేమం కోరుతూ ఈ రూపాన్ని ఎంపిక చేసినట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?

Loading...
Unable to load recommendations.
Follow Us