హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవేను ఆరు లేన్లుగా విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది. మొత్తం 284 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ భారీ ప్రాజెక్టుకు సుమారు రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. PPPAC ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వగా, తుది అనుమతుల తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. మూడు ప్యాకేజీలుగా చేపట్టే ఈ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్-ఏపీ మధ్య ప్రయాణం, సరుకు రవాణా మరింత వేగంగా సాగనుంది.
ఆ రూట్ లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సంక్రాంతి సమయంలో వెళితే చుక్కలు కనిపిస్తాయి. అదే హైదరాబాద్-విజయవాడ రహదారి. ఇలాంటి సమయంలో ఓ పెద్ద అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవేను సిక్స్ లేన్స్.. అంటే ఆరు వరసలుగా విస్తరించే క్రమంలో పెద్ద ముందడుగు పడింది. P-P-P-A-C… దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అప్రూవల్ తో పనులు స్టార్టవుతాయి. ఈ మాట విని ఆ రూటులో వెళ్లేవారంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ పనులను మొత్తం 3 ప్యాకజీలుగా చేస్తారు. మొత్తం 284 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కు అంచనా వ్యయం ఎంతో తెలుసా? 12 వేల కోట్ల రూపాయిలు. ఇందాక మనం P-P-P-A-C.. అని చెప్పుకున్నాం కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ. దీనినే సింపుల్ గా P-P-P-A-C.. అని పిలుస్తాం. ఇప్పుడిదే… ఆరు లేన్ల రహదారి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. N-H-A-I- కూడా దీనికి ఓకే చెప్పింది. C-C-E-A – ఆమోదంతో పట్టాలెక్కుతుంది. అసలీ ప్రాజెక్టు ఎక్కడ మొదలవుతుంది.. ఎక్కడి వరకు వెళుతుంది ఇవన్నీ ఇందులో చాలా కీలకం. ఇక ఈ ప్రాజెక్టును B-O-T- పద్దతిలో నిర్వహిస్తారు. 284 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా చేపడతారు. ఫస్ట్ వన్ చూస్తే.. హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్కాపూర్ నుంచి విజయవాడలోనే గొల్లపూడి బైపాస్ వరకు ఉంటుంది. ఇక్కడ 226 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి ఉంది. ఇప్పుడు దీనిని ఆరు వరసల మార్గంగా మారుస్తారు. ఇందులో కూడా రెండు ప్యాకేజీలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు ఒకటైతే.. నందిగామ నుంచి గొల్లపూడి దగ్గరున్న విజయవాడ బైపాస్ వరకు ఇంకో ప్యాకేజీగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నుంచి చూద్దాం. బెజవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవేను విస్తరిస్తారు. దీని కోసం సిద్ధార్థ కాలేజ్ నుంచి అమరావతి ORR క్రాస్ అయ్యేవరకు… అంటే ఆ ఏరియా మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం నాలుగు లేన్ల రహదారి ఉంది. దీనికి ఏం చేస్తారంటే.. రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడతారు. సో.. ఓఆర్ఆర్ వరకు సీన్ ఇలా ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ నుంచి మచిలీపట్నం వరకు మొత్తం 44 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న నాలుగు వరసల రహదారిని ఆరు వరసలకు పెంచుతారు. ఇది హైబ్రిడ్ యాన్యుటీ పద్దతిలో ఉంటుంది. సో.. ఇందాక మనం చెప్పుకున్నట్టు హైదరాబాద్-విజయవాడ మధ్య ఉన్న 226 కిలోమీటర్లు, అలాగే విజయవాడ-మచిలీపట్నం మధ్య ఉన్న 58 కిలోమీటర్లు.. అంటే మొత్తం 284 కిలోమీటర్లను ఆరు లేన్ల రహదారిగా మార్చడానికి అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టుపై గతంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో N-H-A-I- క్లారిఫికేషన్ ఇచ్చింది. తరువాత ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యంత ముఖ్యమైనది భూసేకరణ. తరువాత నిర్మాణం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వీటన్నింటికీ కలిపి సుమారు 12 వేల కోట్ల రూపాయిలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు ఫైనల్ పర్మిషన్ వచ్చాక.. టెండర్లు పిలుస్తారు. ఇవి ప్యాకేజీల వారీగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో ఐదారు గంటల సమయం పడుతుంది. వీకెండ్ వచ్చిందంటే రష్ మామూలుగా ఉండదు. అదే పండగల సమయంలో అయితే వాహనాల రద్దీ అంతా ఇంతా కాదు. వరుసగా సెలవులు వచ్చినప్పుడూ అదే సీన్ కనిపిస్తుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్దీ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఐదారు గంటల్లో విజయవాడ చేరుకోవాల్సింది కాస్తా.. దాదాపు ఎనిమిది గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే ఈ రూటును ఎనిమిది లేన్ల రహదారిగా మారిస్తే.. వాహనాల రద్దీని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్ స్పీడ్ ను పెంచే ఛాన్సిస్తే.. ఇంకా వేగంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. దీనివల్ల జర్నీ సుమారు మూడు గంటల కన్నా ఎక్కువగానే తగ్గే అవకాశముంది అని నిపుణులు చెబుతున్నారంటే.. ఎంత సమయం ఆదా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం కలిగినట్టే. హైదరాబాద్ నుంచి అమరావతి ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే అనుకున్నా.. తరువాత ప్లాన్ మారింది. సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా కేంద్రమంత్రి గడ్కరీకి లెటర్ రాయడంతో హైదరాబాద్ నుంచి గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యే వరకు ఆరు లేన్ల రహదారిని విస్తరించేలా ప్రాజెక్టులో మార్పులు చేశారు. అంటే 198 కిలోమీటర్ల దూరం కాస్తా.. 226 కిలోమీటర్ల వరకు విస్తరించేలా మార్పులు చేశారు. డీపీఆర్ కూడా దానికి తగ్గట్టే రెడీ అయ్యింది. ప్రాజెక్టును డీప్ గా పరిశీలిస్తే.. P-P-P-A-C.. కొన్ని ప్రతిపాదనలకు ఓకే చెప్పలేదు. గొల్లపూడి నుంచి భవానీపురం మీదుగా వచ్చే హైవే నాలుగు వరసలుగానే ఉంది. దీంతో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. అందుకే దానిని భవానీపురంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు పొడిగించాలని కోరారు. అంటే మరో 5 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రహదారి అవసరమవుతుంది. మొత్తం చూస్తే.. 231 కిలోమీటర్లు అవుతుంది. కానీ P-P-P-A-C.. మాత్రం దీనికి ఓకే చెప్పలేదు. ఇక మచిలీపట్నం వరకు హైవేని విస్తరిస్తారని చెప్పుకున్నాం. ఇందులో భాగంగా బెంజ్ సర్కిల్ నుంచి ఈడుపుగల్లు కూడలి వరకు ఆరు లేన్ల రహదారి ఉండేలా పైవంతెనకు ప్రపోజల్ వచ్చింది. కానీ P-P-P-A-C.. మాత్రం దీనికి నో చెప్పింది. అందుకే కానూ నుంచి దావులూరు టోల్ ప్లాజా ఓఆర్ఆర్ వరకు నాలుగు లేన్ల రహదారికి రెండు వైపులా సర్వీసు రోడ్లు వేస్తారు. అంటే.. ఓఆర్ఆర్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకే ఆరు లేన్ల రహదారి ఉంటుంది. ఈ పెద్ద ప్రాజెక్టు పొడవునా రద్దీ మార్గాల్లో బైపాస్ లు ఉంటాయి. అండర్ పాసులు ఉంటాయి. ఫ్లైఓవర్లను నిర్మించాలి. ఎందుకంటే ఈ రూట్ లో ప్రధానమైన జంక్షన్లు కొన్ని ఉన్నాయి. చౌటుప్పల్, నార్కట్ పల్లి, సూర్యాపేట, కోదాడ, నందిగామ.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువ. అందుకే వాహనాలు బ్రేక్ లేకుండా వెళ్లడానికి వీలుగా గ్రేడ్ సెపరేటర్లను రెడీ చేస్తారు. సో.. నడిచేవారికి కానీ, లోకల్ గా తిరిగే వాహనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తెస్తారు. ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో నైట్ టైమ్ కూడా క్లియర్ గా చూసేలా రిఫ్లెక్టర్లు, ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్లను రెడీగా ఉంచుతారు. రహదారుల నిర్మాణం, విస్తరణ వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుంది. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ మధ్య సరుకు రవాణాలో వేగం పెరుగుతుంది. పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, పోర్టుల మధ్య రవాణా వేగంగా జరుగుతుంది. దీనివల్ల బిజినెస్ పెరుగుతుంది. అది రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడడానికి హెల్ప్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ రానా షాకింగ్ కామెంట్స్
