ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో 21 ఏళ్ల యువతి హత్య కేసు కలకలం రేపింది. బీహార్‌కు చెందిన రహీనకు ఫంక్షన్ హాల్‌లో పనిచేసే అహ్మద్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అహ్మద్ తల్లిదండ్రులతో కలిసి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన యువతి హత్య కేసులో సంచలన విషయంతో కలకలం రేపుతోంది. బీహార్‌కు చెందిన 21 ఏళ్ల రహీన పహాడీషరీఫ్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివసిస్తోంది. స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే చోట పనిచేసే బాలాపూర్‌కు చెందిన అహ్మద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఇటీవల రహీన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అహ్మద్‌కు చెప్పి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో పాటు, పెళ్లి పీటలెక్కితే సమస్య వస్తుందనే ఉద్దేశంతో అహ్మద్ ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది హత్యకు దారితీసింది. ప్లాన్‌లో భాగంగా అహ్మద్ తన తల్లిదండ్రులతో కలిసి రహీనాను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అర్థరాత్రి సమయంలో వారి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు క్షణాల వ్యవధిలో ఘటనాస్థలికి చేరుకున్నారు. గోనె సంచితో మృతదేహాన్ని తరలిస్తున్న అహ్మద్‌ను, అతనికి సహకరించిన తల్లిదండ్రులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం, చివరకు నిండు ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!
