బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో

Updated on: Sep 11, 2025 | 1:40 PM

బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డబ్బులు, ఫోన్లు పోగొట్టుకుంటుంటారు. బస్సుల్లో రద్దీని ఆసరాగా చేసుకొని దొంగలు రెచ్చిపోతుంటారు. బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల పాకెట్‌నుంచి ఫోన్లు, నగదు కొట్టేస్తుంటారు. అలా ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడు. తీవ్రంగా నష్టపోయాడు. ఫోన్‌తో పాటు ఏకంగా రూ.6.15 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయం కావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎం.ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్‌లో నాందేడ్ వెళ్లే బస్సు ఎక్కారు. కాసేపటికే తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బోధన్ చేరుకున్నాక పాత నంబర్‌ను బ్లాక్ చేయించి, అదే నంబర్‌పై కొత్త సిమ్‌కార్డు తీసుకున్నారు. అయితే కొత్త ఫోన్ లేకపోవడంతో ఆ సిమ్‌ను వెంటనే ఉపయోగించలేదు. ఇదే అదనుగా భావించిన దొంగ పాత ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి ప్రసాదరావుకు చెందిన కెనరా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షలు, మరో సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 2.15 లక్షల చొప్పున మొత్తం రూ. 6.15 లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఈ నెల 6వ తేదీన ప్రసాదరావు కొత్త ఫోన్ కొనుగోలు చేసి, అందులో తన సిమ్ వేయగా అసలు విషయం బయటపడింది. తన ఖాతాల నుంచి భారీగా డబ్బు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌లు చూసి ఆయన కంగారుపడ్డాడు. వెంటనే తేరుకుని మంగళవారం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నప్పటికీ, దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్లే నిందితుడికి లావాదేవీలు జరిపేందుకు సమయం దొరికిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు

మరిన్ని వీడియోల కోసం :

లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్‌ కపుల్‌.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో