రక్షణ రంగం ఉత్పత్తులకు కేరాఫ్ గా హైదరాబాద్
విశ్వనగరం హైదరాబాద్ భారత రక్షణ రంగంలో కీలకంగా మారింది. రక్షణ ఉత్పత్తులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పటికే పలు కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. కొత్తగా మరిన్ని కంపెనీలు వచ్చే ఛాన్సుంది. ముఖ్యంగా వార్‌జోన్‌లో కీలకంగా వ్యవహరించే క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్ సిస్టమ్స్, ట్రైనింగ్ సిస్టమ్స్, విడిభాగాలు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కాబోతున్నాయి.
రక్షణ ఉత్పత్తుల కోసం ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాపై ఆధారపడిన మన దేశం.. ఆయా దేశాల కంపెనీల నుంచి ఆయుధాలు, ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూ వచ్చింది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందించి, కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫలితంగా నాలుగైదేళ్లుగా మార్పు వస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక కంపెనీలకు రక్షణ శాఖ, రక్షణ సంస్థల నుంచి ఆర్డర్లు లభిస్తున్నాయి. రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీఓ విభాగాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అదనంగా బీడీఎల్, మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు.. హైదరాబాద్ చుట్టుపక్కలా ఉన్నాయి. ఈ సంస్థల మద్దతుతో ప్రైవేటు రంగంలో ఎన్నో సంస్థలు స్థానికంగా ఏర్పాటయ్యాయి. జెన్ టెక్నాలజీస్, అవాంటెల్, అస్త్ర మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలకు ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ట్రైనింగ్ సిస్టమ్స్, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ అందించే సంస్థకు రక్షణ శాఖ నుంచి తాజాగా రూ.289 కోట్ల ఆర్డర్ లభించింది. డ్రోన్ టెక్నాలజీ ఆధునికీకరణకు వచ్చిన ఈ ఆర్డర్‌ను, ఏడాది కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరో సంస్థకు రూ.285.56 కోట్ల ఆర్డర్ లభించింది. భారత వాయుసేనలోని స్పెషల్ ఫోర్సెస్ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్, విడిభాగాలను 11 నెలల వ్యవధిలో ఈ సంస్థ సరఫరా చేయాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం
బురద మీద పడిందని ఇలా బుద్ధి చెప్పింది..
వేలానికి బంగారు టాయిలెట్.. ధర ఎంతో తెలుసా
