గంజాయి మత్తులో రచ్చ రచ్చ.. డ్రైవర్‌పై దాడి
హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి మత్తులో ఉన్న యువకుల గ్యాంగ్ బస్సుపై దాడి చేసి, డ్రైవర్‌ను కొట్టడం యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనాన్ని స్పష్టం చేస్తుంది. చట్టంపై భయం లేకుండా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రజలు నిస్సహాయంగా చూస్తుండగా, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం వ్యవస్థపై విమర్శలకు దారితీస్తోంది. యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించడం అత్యవసరం.
యువత మత్తుకు బానిసై విపరీత చర్యలకు పాల్పడుతోంది. చట్టంపై కనీస భయం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల నుంచి యువతను ఎంత కట్టడి చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లోని కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తు పదార్థం ప్రభావంలో ఉన్నట్లు ఓ గ్యాంగ్ నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మత్తులో తూలుతున్న ఆ గ్యాంగ్ సభ్యులు ప్రైవేట్ బస్‌పై దాడి చేసి, ఆ బస్‌కి చెందిన గాజు తలుపులు, కిటికీలను కర్రలతో పగలగొట్టారు. నడిరోడ్డుపై నిలిపి ఉన్న ఆ బస్సుపై అందరూ చూస్తుండగానే దాడులకు పాల్పడ్డారు. ఈ తతంగం అంతా చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా లేరు. ఆ బస్సు పటాన్‌చెరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్తున్నట్లు సమాచారం. గంజాయి మత్తులో ఉన్న ఆ గ్యాంగ్ అంతటితో ఊరుకోలేదు. గ్యాంగ్ సభ్యులు బస్సు డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. బస్సు డ్రైవర్ యూ-టర్న్ తీసుకునే క్రమంలో తమ కారును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయాడని ఆ గ్యాంగ్ వాదించింది. ఈ దాడితో బస్సులో ఉన్న ప్రయాణికులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన గ్యాంగ్ ముఠా సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
