జవాన్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. నలుగురు నిందితుల అరెస్ట్!

Updated on: Aug 12, 2026 | 3:20 PM

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన ఐటీ ఉద్యోగి క్రాంతి, అతడి మిత్రులతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, మృతిచెందిన వ్యక్తి ఎక్స్-ఆర్మీ జవాన్. ప్రస్తుతం మెస్కోలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఆయన డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిందితులు క్రాంతి (కారు యజమాని, ఐటీ ఉద్యోగి), వీరేశ్ (డ్రైవర్, స్విగ్గీ డెలివరీ బాయ్), వికాస్ గౌడ్ (క్రాంతి బామ్మర్ది), చంద్రన్ యాదవ్ (ప్రైవేట్ వర్కర్)గా గుర్తించారు. వీరంతా మద్యం సేవించి ఓవర్‌స్పీడ్‌తో వాహనం నడుపుతూ జవాన్‌ను ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే జవాన్ అక్కడికక్కడే మరణించారు.డ్రైవర్ వీరేశ్‌కు బ్రీత్ అనలైజర్‌లో 116 శాతం, క్రాంతికి 180 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. తాగి వాహనాలు నడిపేవారిపై, హిట్ అండ్ రన్ కేసులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగి సీఐ హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

Published on: Aug 12, 2026 03:19 PM
Loading...
Unable to load recommendations.
Follow Us