Hyderabad: పిల్లలను మార్చడంలో వారిదే కీలక పాత్ర-సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి
పిల్లల్లో సహజసిద్ధమైన ఆసక్తి, అవగాహన, సృజనాత్మకత పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో “హైదరాబాద్ కి కహాని” అనే నేపథ్యంతో జరిగిన ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పిల్లల్లో సహజసిద్ధమైన ఆసక్తి, అవగాహన, సృజనాత్మకత పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో “హైదరాబాద్ కి కహాని” అనే నేపథ్యంతో జరిగిన ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీపీ శిల్పవల్లి, పిల్లలతో శారీరకంగానే కాక భావోద్వేగపరంగా కూడా మమేకం కావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు సూచించారు. వారి విన్నపాలు వినాలి, వారిని ప్రోత్సహించాలి, సరైన దిశలో మార్గదర్శనం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండ పాల్గొని విద్యార్థులను అభినందించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. తమ పిల్లల ప్రతిభకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.