Telangana: బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తుండగా ఒక్కసారిగా షాకింగ్ సీన్..

Edited By: Ram Naramaneni

Updated on: Jul 18, 2025 | 6:51 PM

ఓ యువకుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. యువకుడికే కాదు. ఆ చుట్టుపక్కల అనేకమందికి ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యువకుడు పెట్రోలుకొట్టించుకుంటుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో అక్కడున్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యువకుడు అలర్ట్‌ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోనీ పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకునేందుకు ఓ యువకుడు తన బైక్‌తో వచ్చాడు. పెట్రోలు పంప్‌ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందికి పెట్రోలు కొట్టాల్సిందిగా చెప్పాడు. అతను పైపు తీసుకొని యువకుడి బైకులో పెట్రోలు పోస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పెట్రోలు పైపునుంచి మంటలు చెలరేగాయి. ఒక్క క్షణం ఇద్దరూ షాకయ్యారు. పెట్రోలు పోస్తున్న యువకుడు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయాడు. వాహనదారుడు అలర్టయి పైపును తీసి కిందపడేశాడు. ఇంతలో అక్కడే ఉన్న మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి మంటలు వ్యాపించకుండా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jul 18, 2025 06:51 PM