అమెరికాలో ముంచెత్తుతున్న వరదలు.. అల్లాడిపోతున్న నగరవాసులు..

|

Jun 24, 2024 | 8:11 AM

భారీ వరదలతో అమెరికా విలవిల్లాడుతోంది. వందల ఇళ్లు నీట మునిగాయి. ఐయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో చాలా కౌంటీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

భారీ వరదలతో అమెరికా విలవిల్లాడుతోంది. వందల ఇళ్లు నీట మునిగాయి. ఐయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో చాలా కౌంటీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్‌వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సియోక్స్ ఫాల్స్‌లోని ఫాల్స్‌ పార్కుడా బ్రిడ్జి కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా మాడిసన్‌ సెయింట్‌ ప్రాంతంలో వరద నీరు నిల్చిపోయింది.వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లు, స్థానికులు. ఇంకా జల దిగ్బంధంలో యూఎస్‌.. రాక్ వ్యాలీ నగరం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on