Vizag: వరి కోస్తుండగా పొలంలో ఏదో అలికిడి.. రైతులు వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్

Updated on: May 03, 2025 | 9:17 PM

పంట ఏపుగా పెరిగిందని.. వరి కోసేందుకు వచ్చారు రైతులు. ఇక ఆ పనులు చేస్తుండగా.. ఏదో అలికిడి వినిపించింది. ఏంటని చూడగా.. దెబ్బకు దడుసుకుని అమ్మబాబోయ్.! భయంతో పరుగో పరుగు బయటకు.. ఇంతకీ ఏం జరిగిందో చూస్తే.. ఈ స్టోరీ చదివేయండి..

పాము అంటే ఎవరికి భయం ఉండదు. ఆమడదూరంలో కనిపించినా కూడా.. మన గుండె గుభేల్ అంటుంది. మరి దగ్గరకు వస్తే.. అప్పుడు మన గుండె ప్యాంట్‌లోకి జారిపోతుంది. సరీసృపాలలో పైథాన్ భారీగా కాయంతో ఉంటుందని అంటారు. సరిగ్గా అలాంటి ఓ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రాజాం మండలం పొనుగుటివలస పొలాల్లో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. వరి కోస్తుండగా రైతులకు కొండచిలువ కనిపించడంతో దెబ్బకు దడుసుకున్నారు. భయాందోళనకు గురై రైతులు పరుగులు పెట్టారు. అయితే కొందరు రైతులు మాత్రం కర్రల సాయంతో కొండచిలువను పక్కనున్న పొదల్లో విడిచిపెట్టారు.

Published on: May 03, 2025 09:15 PM