టోల్‌గేట్‌‌లో పోలీసుల చెకింగ్.. వ్యాన్‌లో కనిపించిన బ్యాగులు చెక్ చేయగా.. ధగధగ మెరుస్తూ.!

Updated on: Apr 08, 2024 | 8:06 PM

ఎన్నికల వేళ ఏపీలో మద్యంతో పాటు భారీగా నగదు పట్టుబడటం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర టోల్‌గేట్‌ వద్ద బంగారం, వెండి పెద్దమొత్తంలో పట్టుబడింది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

ఎన్నికల వేళ ఏపీలో మద్యంతో పాటు భారీగా నగదు పట్టుబడటం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర టోల్‌గేట్‌ వద్ద బంగారం, వెండి పెద్దమొత్తంలో పట్టుబడింది. సుమారు 33 కిలోల బంగారం, 16కిలోల వెండిని పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు ఏలూరు ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి తరలిస్తున్న 15 లక్షల రూపాయలను సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్‌ చేశారు. ఇటు కర్నూలులోనూ భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశారు అధికారులు. 14 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్టేషన్‌కు తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు.

Published on: Apr 08, 2024 08:05 PM