కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్ ట్విస్ట్
తిరుపతి జిల్లా అనంతరాజుపేట వద్ద హుబ్లీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. రాత్రివేళ రైలు బోగీపై మంటలు చెలరేగగా, తనిఖీ చేయగా కాలిపోయిన మృతదేహం బయటపడింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడం వల్లే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమిక నిర్ధారణ. ఆ వ్యక్తి రైలుపైకి ఎలా చేరాడనేది మిస్టరీగా మారింది. ఈ ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
సుదూరప్రాంతాలకు ప్రయాణించాలంటే రైలును మంచిన ప్రయాణసాధనం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలతో కలిసి ప్రయాణించేవారికి ఈ రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ఎక్కువమంది రైలుప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. అలా ఎంతో భరోసాతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. రాత్రివేళ ప్రశాంతంగా రైలు ప్రయాణం సాగతున్న వేళ ఒక్కసారిగా ఆకాశం వైపు నుంచి వచ్చిన అగ్నికీలలు వారిని వణికించాయి. తిరుపతి జిల్లా అనంతరాజుపేట సమీపంలో హుబ్లీ – తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్ నుంచి మూడవ బోగీపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. చీకటి కావడంతో మంటలు ఆరిపోయినట్లు భావించి, రైలును సమీపంలోని రైల్వే కోడూరు స్టేషన్‌కు తరలించారు. అయితే, అక్కడికి చేరుకున్నాక బోగీ పైభాగంలో తనిఖీ చేసిన అధికారులు అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. మంటలు వచ్చిన చోట ఓ గుర్తుతెలియని వ్యక్తి కాలిపోయి మృతదేహమై కనిపించాడు. రైలు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడం వల్లే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఆ వ్యక్తి బోగీపైకి ఎలా వెళ్ళాడు అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. స్టేషన్‌లో రైలుపైకి ఎక్కాడా? లేక ఏదైనా బ్రిడ్జి పైనుంచి నడుస్తున్న రైలుపై పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెప్పపాటులో ఈ ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, రైల్వే భద్రతపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఏ ఉద్దేశంతో బోగీపైకి వెళ్ళాడనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ
Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
