గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

Anil kumar poka

|

Updated on: Dec 02, 2024 | 6:25 PM

తినేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అది ప్రాణానికే ప్రమాదం. ఈమధ్య జరిగిన ఘటనలు చూస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే.. గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే.. ఒక్కోసారి ప్రాణాపాయం తప్పదు. దీంతో.. వైద్యునిపుణులు ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుంటే.. దానిని ఎలా తీయాలి అన్న విషయాన్ని డెమో చేసి చూపించారు నీలోఫర్ వైద్యులు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అసలు పిల్లల గొంతులో తినుబండారాలు ఇరుక్కోవడానికి ప్రధాన కారణం… అలాగే గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కున్నప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటి అన్నదానిపై నీలోఫర్ డాక్టర్లు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. చేతిలు ఉన్న వస్తువులను నోట్లో పెట్టుకోవడం సాధారణం. ఒక్కోసారి ఆ వస్తువును పొరపాటున మింగడంతో అది గొంతు, ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు విడిచిన ఘటనలు సైతం ఉన్నాయి. గొంతులో ఆహార పదార్థాలు ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలో తెలియక, సరైన అవగాహన లేక పలువురు ఆ సమస్యను పెద్దది చేసుకుంటున్నారు. మాంసాహారంతో పాటు గట్టిగా ఉండే పదార్థాలను మెత్తగా నమిలి తినాలని సూచిస్తున్నారు వైద్యులు.

క్యారెట్ వంటి ఆహార పదార్థాలను డైరెక్ట్ గా పిల్లలకు ఇవ్వకూడదని వాటిని కట్ చేసి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల మెడలో సన్నటి గొలుసులు, నెక్లెస్ వేయకూడదని… పిల్లల గొంతులో పొరపాటున ఏదైనా ఇరుక్కుపోతే పొట్టపై రుద్దకూడదని వైద్యలు సూచించారు. పిల్లలు, పెద్దల గొంతు, ఆహార నాళాల్లో ఏదైనా ఇరుక్కుపోయిందని గమనించిన వెంటనే బలవంతంగా తీయడానికి ప్రయత్నించకుండా వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించాలన్నారు. గొంతులో ఇరుక్కుపోయిన వస్తువుల స్థితిని గమనించి సూక్ష్మ పరికరాలతో జాగ్రత్తగా బయటకు తీయడమో లేదా పొట్టలోకి నెట్టడమో చేస్తామన్నారు నీలోఫర్ వైద్యులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.