Sleeping: నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్లెమ్.?

|

Nov 27, 2024 | 12:40 PM

పురుషులు మరియు మహిళలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటారని మనకు ఇప్పటికే తెలుసు. వాటిల్లో ఒకటి నిద్ర అలవాట్లు. ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ, నిద్ర పొందే విషయంలో ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. పురుషులు మరియు మహిళలల్లో అవసరమైన నిద్ర , ఎదుర్కొనే నిద్ర సవాళ్లు వేరుగా ఉంటాయి.

కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా..

మనిషి నిద్రపోవడంలో, నిద్రను ప్రభావితం చేయడంలో మన హార్మోన్లు.. టెస్టోస్టెరాన్ స్థాయిలు కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఈ అధ్యాయం ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా నిద్రపోతారని తాజా అధ్యయనం వెల్లడించింది.. పరిశోధనలో భాగంగా మగవారి నిద్ర విధానాలపై అదేవిధంగా మహిళల నిద్ర విధానాలపై పరిశోధన చేయగా.. కొన్ని తేడాలు గమనించారు పరిశోధకులు. పురుషులు.. మహిళలు ఇద్దరి మధ్య నిద్ర వ్యత్యాసాలు వారి వ్యక్తిగత ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావాలను కలిగి ఉంటాయనిది ఈ పరిశోధన సారాంశం.

ఈ అధ్యాయంలో పాల్గొన్న పరిశోధకుల రిపోర్ట్ ప్రకారం.. పురుషులు.. మహిళలు ఇద్దరూ వేరువేరు నిద్ర విధానాలను కలిగి ఉంటారు. జంతువులలో నిద్ర విధానాలను పరిశోధన చేయటం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళలలో నిద్ర గురించి పరిశోధన నిర్వహించారు.. ఇది మానవ ఆరోగ్యం పై ఎలా ప్రభావాన్ని చూపుతుందో పరిశోధించడం వీరి ఉద్దేశం. మధుమేహం ఊబకాయం అల్జీమర్స్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నిద్రని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఈ తాజా అధ్యయనంలో కదలికలను గుర్తించడానికి ఆల్ట్రా సెన్సిటివ్ సెన్సార్లతో ప్రత్యేక బోనులలో 267 ఎలుకలపై ఈ పరిశోధన నిర్వహించారు. 24 గంటల సమయంలో మగ ఎలుకలు దాదాపు 670 నిమిషాల పాటు నిద్రపోతే.. ఆడ ఎలుకలు గంట తక్కువ నిద్రపోయాయని వీరు గుర్తించారు. ఆడవారిలో హార్మోన్ల మార్పులు, ఆడవారి హార్మోన్లు నెలవారీగా, జీవితాంతం మారుతూ ఉంటాయి. ఈ మార్పులు నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల ఎక్కువగా నిద్ర పోవడం జరగడం లేదని పరిశోధన రిపోర్ట్. మహిళలు వారి పీరియడ్ టైం లో నిద్రపోవడం లో డిస్టబెన్స్ ను మనం గమనించవచ్చని వివరించింది.

ఆడవారికి నెలసరి సమయంలో, గర్భం దాల్చిన తర్వాత, తల్లిపాలు ఇవ్వడం.. రుతుక్రమం ఆగిపోయిన సమయంలో సంభవించే హార్మోన్ మార్పుల వల్ల నిద్ర కు ఇబ్బంది అవుతుంది.. వీటివల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది.. ఈ సమయాల్లో, మహిళలు నిద్రకు భంగం కలిగించే తిమ్మిరి,చెమటల తో కొంత అసౌకర్య శారీరక లక్షణాలను అనుభవిస్తారు. కాబట్టి ఇలాంటి కారణాలతో ఆడవారు జీవితంలోని ఈ దశలలో నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి కొన్ని నిద్ర రుగ్మతలతో బాధపడతారని అధ్యయనంలో తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.