Andhra: చికెన్ బిర్యానీ తినదామని ఆర్డర్ ఇచ్చాడు.. కట్ చేస్తే.. చివరికి సీన్ సితారయ్యింది
హోటల్‌కు వెళ్లాడు.. బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. కాసేపు వెయిట్ చేశాడు. ఆర్డర్ ఇంకా రాలేదు. ఎందుకు ఇంత లేటు అని అడిగేసరికి దెబ్బకు ఆ తర్వాత సీన్ చూసి షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఘర్షణ చోటు చేసుకుంది. బిర్యానీ ఆర్డర్ ఆలస్యంగా వచ్చిందని హోటల్ సిబ్బందిని కస్టమర్ నిలదీయగా.. అలా ఎందుకడిగావ్ అని చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా రోడ్డుమీదకు లాక్కెళ్లి మరీ కస్టమర్‌ను చితకబాదారు హోటల్ యాజమాన్యం, సిబ్బంది. శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి చాలా సమయం అయ్యిందని.. ఇంకా ఎంతసేపు ఆగాలని అడిగినందుకు కస్టమర్‌ను చితక్కొట్టారు హోటల్ సిబ్బంది. అయితే, కస్టమర్ మద్యం మత్తులో హోటల్‌కి వచ్చి.. తమతో గొడవ పడ్డాడని అంటున్నారు యాజమాన్యం, సిబ్బంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published on: Nov 03, 2025 09:47 AM