Vijayawada: విజయవాడలో ‘హైడ్రా’ తరహా కూల్చివేతలు.. ఒకేసారి 42 భవనాలు..
విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత వివాదం నెలకొంది. అన్యాయంగా ఇళ్లను కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 42 ఇళ్లను కూల్చివేశారంటోన్నారు బాధితులు. ఆ వివరాలు ఇవిగో ఇక్కడ చూడండి.
విజయవాడ భవానీపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై బాధితుల ఆందోళన కొనసాగుతున్నారు. 42 ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అస్వస్థతకు గురి కాగా.. వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల కూల్చివేతతో ప్లాట్ల యజమానుల్లో భయం నెలకొంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్నారు బాధితులు. నిన్న రాత్రి చంద్రబాబు, లోకేష్‌ను కలిసేందుకు బాధితుల యత్నించగా.. అనుమతి తీసుకుని రావాలని వెనక్కి పంపించారు పోలీసులు. ఇవాళ సీఎం చంద్రబాబును బాధితులు కలిసే అవకాశం ఉంది.
