ఎర్రకోటలో భారీ చోరీ.. రూ.కోటి విలువైన బంగారు కలశం మాయం వీడియో

Updated on: Sep 07, 2025 | 10:04 PM

ఢిల్లీ ఎర్రకోటలోని భారీ చోరీ జరిగింది. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని అపహరించారు దొంగలు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన ఎర్రకోటలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా హాజరైన సమయంలోనే ఈ ఘటన జరగడం విశేషం. ఎర్రకోటలో ప్రస్తుతం జైనుల దశలక్షణ మహాపర్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ప్రముఖ వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ తన పూజలో ఉపయోగించే విలువైన కలశాన్ని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.

సుమారు 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, కెంపులు, పచ్చులతో పొదిగిన ఈ కలశం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వారం ప్రారంభంలోనే ఈ పూజలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం పలికే ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్న సమయంలో ఏర్పడిన సంఘటన ఆశ్రయాగా చేసుకొని వేదికపై ఉన్న కలశాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమయ్యాక కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లోని ఒక అనుమానిత వ్యక్తి కదలికలను గుర్తించామని నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి కేసును చేధిస్తామని ఢిల్లీ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సెప్టెంబర్ తొమ్మిది వరకు జరుగుతుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఎర్రకోట భద్రతపై అనుమానాలకు తావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని జెండా ఎగరవేసే ఈ చారిత్రక ప్రదేశంలో భద్రతా లోపాలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవ భద్రతా డ్రిల్లో భాగంగా పెట్టిన డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమైనందుకు ఏడుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటుపడిన విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో