Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

|

Jul 12, 2024 | 9:55 AM

నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అయితే ఇవాళ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. ఉదయం 10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది రోజంతా

నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అయితే ఇవాళ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. ఉదయం 10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది రోజంతా కంటిన్యూ అవుతుందని చెప్పింది.

తెలంగాణలో గంటల 11 నుంచి 12కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుందని.. వర్షం పడే సమయంలో గాలలు వేగం పెరిగే అవకాశముంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి,మెదక్, కామారెడ్డిలో జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.