Hyderabad: ఇక నాన్‌స్టాప్ వర్షాలే.. ఇళ్ల నుంచి బయటకు రావద్దు.! మళ్లీ కుమ్మేస్తుంది..(Video)

Updated on: Aug 08, 2025 | 8:27 AM

అప్పుడే అయిపోలేదు...! ఇంకా మిగిలే ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇవాళ కూడా తెలంగాణలో వర్షాలు దంచికొడతాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

నిన్న హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన కురిసింది. సరిగ్గా సాయంత్రం వేళ భారీ వర్షం కుమ్మేయడంతో జనజీవనం అస్థవ్యస్తమైంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లపై వరద పోటెత్తింది. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలను వర్షం కుమ్మేసింది. హైదరాబాద్‌లో వర్షపాతం విషయానికి వస్తే.. సిటీలో శేరిలింగంపల్లి జోన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 14.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, ఖైరతాబాద్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఉప్పల్, ఎల్బీనగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అమీర్‌పేట్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, నాగోల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Aug 08, 2025 08:00 AM