Hyderabad: ఎమోషనల్ పోలీస్… పూలతో అ సీఐ కి సత్కారం
ఎలక్షన్ దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. గత వారం పదుల సంఖ్యలో ఐపీఎస్, డీఎస్పీ ల ప్రమోషన్ లు జరిగాయి. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకే సారి 163 మంది ఇన్స్పెఫ్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి.
ఎలక్షన్ దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేర్పులు జరిగాయి. గత వారం పదుల సంఖ్యలో ఐపీఎస్, డీఎస్పీ ల ప్రమోషన్ లు జరిగాయి. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకే సారి 163 మంది ఇన్‌స్పెక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. చాలా కాలంగా లాంగ్ స్టాండింగ్ లో ఉన్న పోలీసులు ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఒకింత బావోద్వేగం కు గురి అవుతున్నారు. ట్రాన్స్ఫర్ అవుతున్న అధికారులకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు చెబుతూ అభిమానం చాటుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్సార్ నగర్ సీఐ గా బాధ్యతుల నిర్వర్తిస్తున్న సీఐ సైదులు ట్రాన్స్ఫర్ లో భాగంగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కు బదిలీ పై వెళ్తున్నారు. మూడు సంవత్సరాలు ఏకధాటిగా ఒకే ప్రాంతంలో పని చేయడంతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ఆయన ట్రాన్స్ఫర్ అవుతున్న వేళ ఘనంగా ఆయనను సత్కరించి గులాబీ పూలతో వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ట్రాన్సఫర్లు ప్రమోషన్ లు సహజం. కానీ పనిచేస్తున్న చోట అభిమానాన్ని సొంతం చేసుకొని మిగతా స్టాఫ్ చేత సెల్యూట్ కొట్టించుకునే వారు ఎంత మంది ఉంటారు.