Loading video

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

|

Mar 21, 2025 | 6:28 PM

నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, అలసట సాధారణ సమస్యలుగా మారాయి. అటువంటి పరిస్థితిలో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే ఒమేగా-3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న వాల్‌నట్లను ‘బ్రెయిన్ ఫుడ్’ అని పిలుస్తారు. వాల్‌నట్స్‌లో ఉండే విటమిన్ E మెదడు కణాలను బలంగా చేస్తుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. ప్రతి ఉదయం నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మెదడు కంప్యూటర్ లా వేగంగా పనిచేయాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ జీవనవిధానంలో చిన్న మార్పు చేయండని నిపుణుల అంటున్నారు. ప్రతి ఉదయం నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ తింటే మెదడు సామర్థ్యాన్ని పెరుగుతుందట. అంతేకాదు వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలో వెల్లడైంది. ఇది జ్ఞాపకశక్తిని పదును పెట్టడమే కాకుండా, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయట. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు క్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగా పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఇబ్బంది కలగుతుంది. తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న వారికి కూడా వాల్‌నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Pawan Kalyan: మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది’ పవన్ ఎమోషనల్‌