టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు శునకం టిటో పేరును కూడా ప్రస్తావించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు రాసాయి. దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని అందించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను తన వద్ద ఎంతోకాలంగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షాకు అప్పగించారట. రతన్ టాటా గతంలో ‘టిటో’ అనే శునకాన్ని పెంచుకున్నారు. అది మరణించిన అనంతరం మరో శునకాన్ని దత్తత తీసుకొని దానికి అదే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. రతన్ టాటా ఆస్తిలో శాంతను నాయుడికు వాటా ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అలాగే మూడు దశాబ్దాలుగా తనవద్ద పని చేస్తూ, తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను కూడా వీలునామాలో చేర్చినట్లు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు రూ.10,000 కోట్ల ఆస్తులు.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జియో దీపావళి రీఛార్జ్.. నవంబర్ 3లోపు రీఛార్జి చేసుకున్నవారికి ₹3,350 బెనిఫిట్స్
పరువు పోతుందనే సైలెంట్‌గా ఉంటున్నారా ?? కంప్లైంట్ అందుకే ఇవ్వడం లేదా ??
బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త
Amaran: శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??
గోవా రైల్లో బుస్.. బుస్..సెకెండ్ ఏసీలో కర్టెన్ తీసి చూస్తే షాక్..