H Pylori Bacteria: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న హెచ్ పైలోరీ బ్యాక్టీరియా.! ఎన్ని కేసులంటే.?
కరోనా తర్వాత ఎన్నో రకాల ప్రమాదకర బ్యాక్టీరియాల గురించి వెలుగులోకి వస్తున్నాయి. అన్ని బ్యాక్టీరియాలను ఎదుర్కొనే ఒకే ఒక్క ఆయుధం పరిశుభ్రత. కరోనా సమయంలో ఇది అందరికీ బాగా అర్థమైంది. వ్యక్తిగత పరిశుభ్రత తో ఎన్నో రకాల వ్యాధులను సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే... డయేరియా, కలరా, కామెర్లు, టైఫాయిడ్ తదితరాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు.
తినే తిండి, తాగే నీరు శుద్ధిగా ఉంటే… మన ఆరోగ్యమూ అంతే సురక్షితంగా ఉంటుంది. శుభ్రతపై ఏమరుపాటుగా ఉంటే శరీరంపై జబ్బులు దాడిచేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా శరీరంలో చేరిపోతుంది. మొదట్లో కడుపు ఉబ్బరం, పొట్టలో మంట, గ్యాస్, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో సమస్య మొదలవుతుంది. తర్వాత అల్సర్లను సృష్టించి బాధపెడుతూ… క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. దాదాపు 80% మందిలో దీని లక్షణాలేవీ కనిపించవు. 20% మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు, రక్తం పడుతుందంటే మాత్రం సమస్య తీవ్రరూపం దాల్చినట్లే. అయితే, దీనికి సమర్థమైన చికిత్స ఉంది’’ అన్నారు నోబెల్ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్ యూనివర్సిటీ క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్యారీ మార్షల్. హైదరాబాద్‌లోని ఏఐజీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పొట్టలో పెప్టిక్ అల్సర్‌కు ఈ బ్యాక్టీరియానే కారణమని, అది క్రమేమీ క్యాన్సర్‌కు దారితీస్తుందని తెలిపారు. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాను బ్యారీ మార్షలే కనుగొన్నారు. దీనిపై డాక్టర్ రాబిన్ వారెన్‌తో కలిసి పరిశోధన చేశారు. శాస్త్రవేత్తలు ఎవరైనా మొదట జంతువులపై ప్రయోగాలు చేసి, వాటి ఫలితాలతో అధ్యయన నివేదికలు రూపొందిస్తారు. కానీ, మార్షల్.. తన శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారు. స్వయంగా ఈ బ్యాక్టీరియాను తీసుకున్నారు.
ఐదు రోజుల తర్వాత వ్యాధి బారిన పడ్డారు. వాంతులు, వికారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. నోటి దుర్వాసన సైతం అనుభవించారు. దాంతో బయాప్సీ చేస్తే… తన జీర్ణకోశంలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నట్లుగా తేలింది. దీనికి చికిత్స పొంది… తిరిగి కోలుకున్నారు. ఈ ఆవిష్కరణకే ప్రొఫెసర్ బ్యారీ మార్షల్‌కు 2005లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. భారత్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతోపాటు ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోనూ ఎక్కువ మంది ఈ బ్యాక్టీరియాతో బాధపడుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు యోగర్ట్/పెరుగు వంటి ప్రోబయాటిక్స్ వాడితే ఉపశమనంగా ఉంటుంది. పూర్తిగా నయమవాలంటే మాత్రం యాంటీబయాటిక్స్ వాడాల్సిందే. నోట్లోని లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలోని పైపొర ఉపరితలంపై ఉండి.. అక్కడి జిగురు వ్యవస్థను దెబ్బతీస్తుంది. జబ్బు తీవ్రమయ్యే వరకు గుర్తించలేకపోతే… చికిత్స కూడా కష్టమవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.