AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని భుజంపై  మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

Phani CH
|

Updated on: Feb 06, 2026 | 7:24 PM

Share

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని వెల్లడిస్తుంది. స్ట్రెచర్ దొరక్క, సిబ్బంది సాయం చేయకపోవడంతో ఒక కొడుకు తన వృద్ధ తండ్రిని భుజాలపై మోసుకెళ్లాడు. లిఫ్ట్ పాడవ్వడంతో స్ట్రెచర్‌ను కూడా ఒంటరిగా లాగాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని, రోగుల పట్ల అమానుష వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులకు అద్దం పడుతూ మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. గుణ జిల్లాకు చెందిన మునేశ్ రఘువంశీ తి తన తండ్రిని తీసుకుని గుణ జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. వాహనం వారిని ఆస్పత్రి గేట్ వద్ద దించేసి వెళ్లిపోయింది. వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో తండ్రి ఉండటం చూసి మునేశ్ స్ట్రెచర్ కోసం వెతికాడు. ఎక్కడా స్ట్రెచర్ దొరకలేదు. ఆస్పత్రి సిబ్బంది కూడా అతడికి సాయం చేయడానికి రాలేదు. దీంతో తండ్రిని భుజాలపై వేసుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. కొన్ని నిమిషాల పాటు ఆస్పత్రి కారిడార్‌లో తిరిగాడు. ఆస్పత్రి సిబ్బందిలో ఒక్కరు కూడా వారికి సాయం చేయడానికి రాలేదు. కనిపించిన ప్రతీ ఒక్క డాక్టర్‌ను.. ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా ఓ స్ట్రెచర్ ఏర్పాటు చేశారు. అయితే, సమస్య అంతటితో తీరలేదు. మునేశ్ తన తండ్రిని తీసుకుని సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లాల్సి వచ్చింది. లిఫ్ట్ పాడైపోవటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మనేశ్ ఒక్కడే స్ట్రెచర్‌ను లాక్కుంటూ సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అతడు అంత కష్టపడుతున్నా ఎవ్వరూ సాయం చేయడానికి రాలేదు. మునేష్‌ పరిస్థితి చూసి ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు. ఆస్పత్రిలో మొత్తం 15 మంది వార్డ్‌బాయ్స్ పని చేస్తున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో ఉంది. కానీ, ఒక్కరు కూడా మునేశ్, అతని తండ్రికి సాయం చేయడానికి రాలేదు. మునేశ్ తనకు ఎదురైన దారుణ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ.. తన నాన్న హై బీపీ రోగి అనీ సరైన సమయంలో వైద్యం చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళితే ఆస్పత్రి సిబ్బంది ఎవ్వరూ తనకు సాయం చేయడానికి ముందుకు రాలేదనీ చాలా ఇబ్బందులు పడ్డాను అంటూ వాపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట

లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు

TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం

ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా