గుజరాత్‌ను ముంచేసిన వరదలు..! నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు ఇవిగో..

|

Aug 27, 2024 | 7:53 AM

గుజరాత్‌ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా జలమయంగా మారింది. వందలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది. కచ్‌లో వరద ప్రవాహానికి పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి

గుజరాత్‌ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా జలమయంగా మారింది. వందలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది. కచ్‌లో వరద ప్రవాహానికి పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. పాపం నోరులేని మూగజీవాలను వరద ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడుతూనే వరదలో కొట్టుకుపోయాయి.