Rajamouli: రాజమౌళి సినిమాలు హిందువులు బ్యాన్ చేయండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు
ఇటీవల వారణాసి సినిమా వేడుకలో దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు, నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా రాజమౌళి సినిమాలను బహిష్కరించండంటూ హిందువులకు పిలుపు ఇవ్వడం సెన్సేషన్‌గా మారింది. తాజాగా దీనిపై ఆయన ఓ వీడియో రిలీజ్ చేసి.. దర్శకుడు రాజమౌళిపై ఫైర్ అయ్యారు.
ఇటీవల వారణాసి సినిమా వేడుకలో దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు, నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా రాజమౌళి సినిమాలను బహిష్కరించండంటూ హిందువులకు పిలుపు ఇవ్వడం సెన్సేషన్‌గా మారింది. తాజాగా దీనిపై ఆయన ఓ వీడియో రిలీజ్ చేసి.. దర్శకుడు రాజమౌళిపై ఫైర్ అయ్యారు. రాజమౌళి సినిమాలను చూడొద్దని హిందువులకు పిలుపునిచ్చారు. విశ్వాసం లేదంటూ అదే దేవుళ్ళు, ధర్మంపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు. మూవీ ప్రచారం కోసం హనుమంతుడిపై కామెంట్స్ చేశావా.? నిజంగా నాస్తికుడివా డిక్లేర్ చేయ్.? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. ‘నీలాంటి డైరెక్టర్‌ను హిందువులు పట్టించుకోరు. గతంలో కూడా హిందూ దేవుళ్ళపై ఇష్టారీతిన మాట్లాడావు. ఇలాంటి నాస్తికుడు డైరెక్టర్‌గా తీసే సినిమాలు జనం చూడకండి. మన ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏమవుతుందో చూపిద్దాం’ అంటూ గోషామహల్ ఎమ్మెల్యే వీడియోలో పేర్కొన్నారు.