చాట్ జీపీటీ ఘిబ్లీ ప్రభంజనం .. త్వరలో గూగుల్‌ మీమ్స్‌ రాక వీడియో

Updated on: Apr 19, 2025 | 2:22 PM

ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీలో విడుదలైన తాజా ఇమేజ్‌ జనరేటర్‌ స్టూడియో ఘిబ్లీ ఆన్‌లైన్‌లో మీమ్స్‌ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్‌ చిత్రాలతో సోషల్‌ మీడియాను నింపేస్తున్నారు. వీటిని ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్‌ అంటున్నారు. ఈ ట్రెండ్‌ను ఒడిసి పట్టుకోవడానికి వ్యాపార సంస్థలు కూడా తమ కంటెంట్‌ను ఈ పద్ధతిలోనే ప్రమోట్‌ చేసుకుంటున్నాయి.

 బుధవారం విడుదలైన ఈ ఇమేజ్‌ జనరేటర్‌ ప్రముఖ జపనీస్‌ యానిమేషన్‌ స్టూడియో ‘స్టూడియో ఘిబ్లీ’ స్ఫూర్తితో ఆర్ట్‌ వర్క్‌ను సృష్టిస్తుంది. ఈ ఫీచర్‌ వల్ల యూజర్లు తమ సృజనాత్మకతతో సృష్టించే కంటెంట్‌ సోషల్‌ మీడియాను ముంచెత్తుతోంది.చాట్‌జీపీటీ వారి ఘిబ్లీ కి ఆదరణ పెరుగుతుండటంతో గూగుల్‌ తాజాగా ఏఐ మీమ్‌ జనరేటర్‌ను విడుదల చేయనుంది. నేరుగా జీబోర్డ్‌ ద్వారా ఏఐ మీమ్ జనరేటర్‌ను అందించాలని ప్లాన్‌ చేస్తోంది. ఎంతో ప్రసిద్ధి చెందిన గూగుల్‌ కీ బోర్డ్ ఆప్‌ జీబోర్డ్‌ . దీంతో యూజర్లకి ఎంతో సులువుగా మీమ్స్ క్రియేట్‌ చేసే అవకాశం లభిస్తుందని ఆండ్రాయిడ్‌ అథారిటీ పేర్కొంది. వందలాది బేస్ ఇమేజెస్‌లో కావలసిన ఇమేజ్‌ ఎంపిక చేసుకుని కాప్షన్‌ జత చేస్తే మీమ్‌ రెడీ అవుతుంది. టాపిక్‌ కు తగ్గ ఇమేజ్‌ ను జనరేటర్‌ అనే ఆప్షన్‌ నుంచి కూడా ఎంపిక చేయవచ్చు.