లక్షణాలున్నాయా? అర్జంట్‌గా క్వారంటైన్‌కు వెళ్లండి!వీడియో

Updated on: May 24, 2025 | 7:25 PM

కరోనా మళ్ళీ భయపడుతుంది. సింగపూర్, చైనా, థాయ్లాండ్ లోనే కాదు. భారత్ లోని యాక్టివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. ఇక సింగపూర్, హాంకాంగ్ లో భారీగా కేసులు నమోదు అవుతూ ఉండటంతో మాస్క్ రూల్ అమలులోకి వచ్చింది. అంతేకాదు, బూస్టర్ డోసులు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు నిర్ధారణ అయిన వారు వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.

సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుంది. దేశంలోను కరోనా వ్యాప్తి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ తీవ్రం కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో చెన్నైతో సహా పలు నగరాల్లో రెండు వారాలకు జ్వరం, దగ్గు, జలుబు, తదితర సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం వైరస్ గా మార్పు చెందిందని, స్వయా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి లక్షణాలు ఉన్నవారు వారం రోజులు తమ ఇళ్లల్లోనే క్వారంటైన్ లో ఉండాలని, జ్వరం తీవ్రత అధికంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్ళాలని సూచిస్తున్నారు.