కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గోల్డ్ లోన్‌కు తాకట్టు పెట్టిన సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు నగలు మాయమైన ఘటన కలకలం రేపింది. గోల్డ్ అప్రైజర్ పరారీలో ఉండటంతో మోసం వెలుగులోకి వచ్చింది. నగలు సురక్షితంగా ఉన్నాయా అనే ఆందోళనతో ఖాతాదారులు బ్యాంకుకు చేరుకోగా, పోలీసులు విచారణ చేపట్టారు.
అవసరాల కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు కోలుకోలేని షాక్ తగిలింది. లోన్ మొత్తం తిరిగి కట్టేసినా నగలు చేతికి రాకపోవడంతో బ్యాంకు అధికారులను నిలదీస్తే ఏకంగా భారీ స్కామే బయటపడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ శాఖలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసే వ్యక్తి, కస్టమర్లు తాకట్టు పెట్టిన సుమారు రూ. 40 లక్షల విలువైన బంగారు నగలతో మాయమయ్యాడు. ఇటీవల కొందరు ఖాతాదారులు తమ గోల్డ్ లోన్ క్లియర్ చేసి, నగలు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఈ మోసం వెలుగుచూసింది. గత మూడు రోజులుగా సదరు గోల్డ్ అప్రైజర్ పరారీలో ఉండటంతో, మిగతా కస్టమర్లలోనూ తమ నగలు సేఫ్‌గా ఉన్నాయా లేదా అనే టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన బ్యాంక్ సిబ్బంది రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఆందోళనకు గురైన కస్టమర్లు భారీగా బ్యాంకుకు చేరుకుని, తమ నగలను చూపించాలని డిమాండ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎక్కడో తప్పు జరిగిందని అంగీకరించిన బ్యాంక్ మేనేజర్ భాస్కర్.. రికార్డులన్నీ పూర్తిగా పరిశీలిస్తే తప్ప అసలు ఎంత మేర మోసం జరిగిందో చెప్పలేమన్నారు. నిందితుడైన అప్రైజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువుపై పడ్డ ఊరు.. మొత్తం ఊడ్చేశారుగా
‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
