గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
పండగలు, ఇంట్లో శుభకార్యాలు ఏవి వచ్చినా మహిళలు ముందుగా ఆలోచించేది బంగారం కొనాలని. ఆలోచించడమే కాదు.. అందుకు సన్నాహాలు కూడా మొదలుపెడతారు. అయితే ఇటీవల మహిళ బంగారం ధరలు భారీగా పెరుగుతూ బంగారం గురించి ఆలోచించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహిళలకు ఇది కాస్త ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.
గడచిన ఐదు రోజులలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు సుమారు రూ. 1920 మేర తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1760 మేరకు తగ్గింది. అటు స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు కూడా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. సుమారు రూ. 2100 మేరకు వెండి ధర దిగొచ్చింది. మరి దేశంలోని పలు నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా ఒకవెయ్యి 540లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,090గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,390 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,940గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,390గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,940గా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పూణేలో కేజీ వెండి ధర రూ. 1,14,900గా ఉంది. కేరళ, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ. 1,24,900గా కొనసాగుతోంది. కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: