Gita Jayanti 2025 : “భగవద్గీత ఒక సామాజిక, రాజకీయ,ఆర్థిక,మానసిక గొప్ప శాస్త్రం”

Updated on: Dec 01, 2025 | 3:46 PM

శ్రీ చిన్న జీయర్ స్వామి భగవద్గీతను సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక శాస్త్రంగా అభివర్ణించారు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఒడిదొడుకులను అధిగమించి విజయం సాధించడానికి ఇది ఒక 'సూపర్ యూజర్ మాన్యువల్' అని ఆయన అన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ సమతా మూర్తి ప్రాంగణంలో సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ గొప్ప గ్రంథం వేదాల సారాంశాన్ని తెలియజేస్తుంది.

భగవద్గీత ఒక సామాజిక, రాజకీయ,ఆర్థిక,మానసిక గొప్ప శాస్త్రమని… వేదాల్లోని సారాన్నంతా తెలియజేసే మహా గ్రంథమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్నారు. మనం ప్రయాణించే దారులు ఎలా ఉన్నా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా జీవన పయనాన్ని ఎలా విజయవంతంగా సాధించాలి అనే దాని గురించి స్పష్టంగా తెలియజేసే మహాద్భుత గ్రంధం అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. మార్గశిరి శుద్ధ ఏకాదశి రోజు సందర్బంగా ముచ్చింతల్ శ్రీ రామనగరం సమతా మూర్తి ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిచే సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన భగవద్గీత మనకు సూపర్ యూసర్ మాన్యువల్ అని చిన్న జీయర్ స్వామి అన్నారు. సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు దంపతులు పాల్గొన్నారు. జీయర్ ట్రస్ట్ సభ్యులు, జీయర్ స్వామి భక్తులు, వికాస తరంగిణి సభ్యులు, వేద పాఠశాల విద్యార్థులు ఈ గీతా జయంతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో