ఈ ఒక్కదానితో మసాజ్‌ చేస్తే.. చర్మం యవ్వనంగా మెరుస్తుంది

Updated on: Jun 08, 2025 | 12:40 PM

ప్రతి ఒక్కరూ అందంగా, కాంతివంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకు ఎన్నో పద్ధతులు అవలంభిస్తారు. సులభంగా ఇంట్లో ఉండే పదార్ధాలతోనే చక్కని చర్మ సౌందర్యాన్ని ఇపొందవచ్చంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కొల్లాజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కొల్లాజెన్ మెరుగ్గా ఉండాలంటే నెయ్యితో మసాజ్ చెయ్యాలని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని లిక్విడ్ గోల్డ్ అంటారు. ఇందులో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యితో చర్మానికి మసాజ్ చేస్తే చర్మం మాయిశ్చరైజ్ కావడమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. మసాజ్ కు ముందు చర్మాన్ని మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి. నెయ్యిని కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్న నెయ్యి తీసుకుని ముఖానికి పట్టించాలి. వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చెయ్యాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కళ్లు, పెదవుల చుట్టూ, ముడతలు ఉన్న ప్రాంతాలలో సున్నితంగా డీప్ గా మసాజ్ చేయాలి. ఇదే మసాజ్ ను చేతులు, కాళ్లతో పాటూ శరీరం అంతా చేసుకోవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తి పెరగాలంటే వృత్తాకారంగా, పైకి , కిందకూ స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చెయ్యాలి. శరీరానికి నెయ్యితో మసాజ్ చేసిన తరువాత సుమారు 30 నుండి 60 నిమిషాల వరకు దాన్ని అలాగే వదిలేసి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి ఫలితం ఇస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ మొక్క సర్వరోగ నివారిణి..ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి

మీరు నల్లని పాలు ఎప్పుడైనా తాగారా? పోనీ చూశారా?

ఆరోగ్యానికి ఔషధ నిధి చెన్నంగి.. తింటే చెప్పలేనన్ని లాభాలు