Telangana: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా

|

Jul 18, 2024 | 6:26 PM

ఎక్కడ చూసినా కల్తీ.. కల్తీ.. కల్తీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా బీర్‌లో చెత్తాచెదారం నిండి ఉన్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఎక్కడ చూసినా కల్తీ.. కల్తీ.. కల్తీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా బీర్‌లో చెత్తాచెదారం నిండి ఉన్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది.

వివరాల్లోకెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గంగా వైన్స్‌లో అనంతారం గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు బుధవారం తొలి ఏకాదశి పండుగ రోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు. అయితే ఆ యువకుడు 3 కింగ్‌ఫిషర్ బీర్ బాటిళ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. బీర్ బాటిళ్లను ఓపెన్ చేస్తుండగా రెండు బాటిళ్లు ఒక రకంగా.. ఒక బాటిల్ మరొక రకంగా కనిపించింది. బీర్ బాటిల్‌ను పరిశీలించగా బాటిల్‌లో నుంచి కుళ్లిపోయిన దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది. దీంతో మీడియాను ఆశ్రయించి షాపు వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపాడు సదరు వ్యక్తి. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని, కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అనిల్ డిమాండ్ చేశాడు. ఈ విషయంపై వైన్స్ షాపు నిర్వహకుడి వివరణ కోరగా.. పైనుంచి వచ్చే మద్యం తమకు సంబంధం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on