శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గత 60 సంవత్సరాలుగా కర్నాటక సంగీతానికి అందిస్తున్న విశేష సేవల సంగీత దివ్య సౌరభం మరో ముందడుగు వేసింది. మైసూరు లోని అవధూత దత్తపీఠం, అమెరికా లోని యోగ సంగీత సంస్థ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఓ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్‌ను ప్రారంభించారు.
ఆన్లైన్, హైబ్రిడ్ పద్దతుల ద్వారా ముందుగా NRI విద్యార్ధులకు ఈ కోర్సును అందిస్తూ బుధవారం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం భారతదేశం లోని విద్యార్ధులకు విస్తరించనున్నారు. పది సంవత్సరాలకు పైబడిన వారు ఈ కోర్స్‌లో చేరవచ్చు. ఈ కోర్స్ ను పూర్తి చేసిన వారికి తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ అందజేస్తుంది. ఇప్పటి వరకు శ్రీ స్వామీజీ 3 వేలకు పైగా భజన కీర్తనలను అనేక భాషలలో రచించారు . అలాగే శ్రీ స్వామీజీ సంగీతంలో ముఖ్యమైన 72 మేళకర్త రాగాల రూపకర్త వెంకట ముఖి వారసత్వానికి చెందిన వారు కావటం మరో విశేషం. మైసూరు లోని నాదయోగ పరిశోధనా కేంద్రం ద్వారా అటు సంగీతాన్ని, ఇటు ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని సమన్వయం చేశారు. ఈ SGS సంగీత సర్టిఫికేట్ కోర్స్ ను పూజ్య శ్రీ స్వామీజీ సమక్షంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి. నిత్యానందరావు, రిజిస్టార్ కోట్ల హనుమంతరావు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
పైరసీపై ఉక్కుపాదం.. స్ట్రాంగ్ వార్నింగ్..!
