Viral Video: చేపల వేటకు వెళ్లి వచ్చాడు.. కాలు ఏదో దురదగా ఉందన్నాడు.. షూ తీసి చూడగా
ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి.. ఇంటికి తిరిగి రాగా.. కాలు ఏదో దురదగా ఉందని షూ తీసి చూశాడు. ఇక అందులో కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. తన సాక్స్‌కు అంటుకుని ఉన్న రాక్షస జలగను చూసి కళ్లు తేలేశాడు. డేవిడ్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాక..
ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి.. ఇంటికి తిరిగి రాగా.. కాలు ఏదో దురదగా ఉందని షూ తీసి చూశాడు. ఇక అందులో కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. తన సాక్స్‌కు అంటుకుని ఉన్న రాక్షస జలగను చూసి కళ్లు తేలేశాడు. డేవిడ్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాక.. తన కాలి రక్తాన్ని జలగ పీల్చడాన్ని చూసి భయపడ్డాడు. ఈ ఘటన పోలాండ్‌లో సెప్టెంబర్ 13న జరిగింది. జలగ తన రక్తాన్ని పీల్చుతున్న సంగతి కూడా అతడు గమనించలేదట. డేవిడ్ తరచూ తన 61 వేల మంది సిబ్బందితో కలిసి ఉత్తర పోలాండ్‌లోని తుచోలా అడవుల్లో మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సహజ దృగ్విషయాలను తరచుగా అన్వేషిస్తూ ఉంటాడు. ఇక సదరు వ్యక్తి జలగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.