శరీర మాంసాన్ని తినే ఈగ లార్వాలు.. ఈ భయానక వ్యాధితో చాలా డేంజర్!

Updated on: Aug 28, 2025 | 1:20 PM

అమెరికాలో మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో మాంసాన్ని తినే ఈగ లార్వా కేసు నమోదైంది. మేరీల్యాండ్‌లోని ఒక వ్యక్తి ఈ భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు. ఈగలు పుండ్లపై గుడ్లు పెట్టి, లార్వా ద్వారా మాంసం తినేస్తాయి. తగిన చికిత్స లేకపోతే ప్రాణాపాయం కూడా ఉంది. వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్న జీవికి సంబంధించి తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీల్యాండ్లో ఒక వ్యక్తి దీని బారిన పడ్డాడు. ఎల్ సాల్వేడార్ దేశం నుంచి వచ్చిన వ్యక్తికి అక్కడే వ్యాధి సోకినట్లు డాక్టర్లు తెలిపారు. అక్కడ పాడి పశువుల్లో ఉన్న ఈ వ్యాధి ఆ వ్యక్తికి సోకింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీడీసీ సహకారంతో తొలి కేసును యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఈ వ్యాధిని న్యూ వరల్డ్ స్క్రీమ్ వామ్ డిసీజ్ గా పిలుస్తున్నారు. ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్న వారికి మియాసిస్ సోకే అవకాశాలు ఎక్కువ. ఒక ప్రత్యేక జాతికి చెందిన ఈగ పుండ్లపై తిష్ట వేసి గుడ్లు పెడుతుంది. గుడ్లు క్రమంగా లార్వా లాగా మారగా ఆ లార్వాలు మాంసాన్ని తినేస్తాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం తప్పదు. మియాసిస్ ప్రభావానికి గురైన పశువుల నుంచి మనుషులు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముళ్ళును ముళ్ళతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానన్ని అరికట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాయి ఆయా దేశాలు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలతో ఆడ ఈగలు కలిసేలా చేసి ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణించేలా చేస్తున్నారు. గాయాలు, పుండ్లు మానేలా మనుషులు జాగ్రత్త పడితే ఆ ఈగల బారిన పడే అవకాశాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

 

Published on: Aug 28, 2025 01:19 PM