Andhra News: రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు ఏం చేశారో చూడండి!
కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందిరి బస్సులోంచి కిందకు దింపాడు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందిరి బస్సులోంచి కిందకు దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు.. బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చారు. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.