74 ఏళ్ల వయసులో వర్కవుట్స్ ఇరగదీస్తున్న రజినీకాంత్!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జిమ్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఫిట్‌నెస్ పట్ల చూపుతున్న అంకితభావం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జిమ్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఫిట్‌నెస్ పట్ల చూపుతున్న అంకితభావం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎక్స్‌లో ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో రజనీకాంత్ తన ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. వీడియో ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ ‘ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్’ సాధన చేస్తున్నారు. వాలుగా ఉన్న సీటుపై పడుకుని రెండు చేతులతో డంబెల్స్ పట్టుకుని చేతి కండరాలకు పని చెబుతున్నారు. వీడియో తర్వాతి భాగంలో రజనీకాంత్ జిమ్ బెంచ్‌పై కూర్చుని, మళ్ళీ నిలబడుతూ ‘స్క్వాట్స్’ చేస్తున్నారు. ఈ వ్యాయామాన్ని ఆయన చాలాసార్లు రిపీట్ చేశారు. ఇక వీడియో చివరిలో ఆయన తన ఫిట్‌నెస్ కోచ్‌తో కలిసి తన కండరాలను ప్రదర్శించారు. ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాతీ పై భాగాన్ని బలోపేతం చేయడంలో, భుజాల స్థిరత్వాన్ని పెంచడంలోను, భంగిమను మెరుగుపరచడంలోను, కండరాల అసమతుల్యతను నివారించడంలోను సహాయపడుతుంది. రజనీకాంత్ తాజాగా నటించిన ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది. ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, రచ్చిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలలో కనిపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అమల్లోకి వచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి
మరో అద్భుతం.. ఇకపై రోబోలతో పిల్లల్ని కనొచ్చు!
రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం
రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

